ప్రపంచంలో తొలిసారి.. ఒకేరోజు 4 లక్షలకు పైగా

దేశంలో కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలిసారిగా ఒక్కరేజే రికార్డు స్థాయిలో 4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 4 లక్షలకు పైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 19,45,299 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 4,01,993 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,523 మంది కోవిడ్‍తో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 2,11,853కు చేరింది. 2,99,988 మంది కరోనా బాధితులు కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 1,56,84,406 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 32,68,710కి చేరింది. ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది.