అమెరికా ఉన్నంతా కఠినంగా బ్రిటన్ లేదు : ఫౌసీ

కరోనా వ్యాక్సిన్‍కు ఆమోదించడంలో బ్రిటన్ తొందరపాటు ప్రదర్శించిందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనియో ఫౌసి అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ ఆమోదంలో అమెరికా వైద్య అధికారులు ఉన్నంతా కఠినంగా బ్రిటన్ అధికారులు లేరని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ నెల 2న బ్రిటన్ ఫైజర్/బయోఎన్‍టెక్ వ్యాక్సిన్‍ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఫౌసి మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్ ఆమోదంలో బ్రిటన్ సరిగ్గా వ్యవహరించలేదన్నారు. సురక్షితమైన, సమర్ధవంతమైన వ్యాక్సిన్‍ను అమెరికా ప్రజలకు అందించేందుకు అన్ని దశల పక్రియను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే వ్యాక్సిన్ ఆమోద పక్రియను బ్రిటన్ అంతకుముందు సమర్ధించుకుంది. వ్యాక్సిన్ సురక్షితం, సమర్దవంతమైనదని పేర్కొంది.