భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. వరసగా రెండో రోజు కూడా కొత్త కేసులు 17వేలకు దిగువనే నమోదయ్యాయి. మరోవైపు రికవరీ కేసులు కోటీ దిశగా పయనిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 8,96,236 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయగా, 16,375 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో నిన్నటివరకు దేశవ్యాప్తంగా 1,03,56,844 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా జూన్ 24న 16,922 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా రెండు రోజులుగా అదే స్థాయి తగ్గుదల కనిపిస్తోంది.
క్రియాశీల కేసులు 2.31 లక్షలకు చేరుకున్నాయి. ఆ రేటు 2.36 శాతానికి తగ్గింది. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే 29,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 99.75 లక్షలు (96.19శాతం)గా ఉంది. మరోవైపు, గత 11 రోజులుగా మరణాలు 300 లోపునే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 201 మంది మరణించగా, ఇప్పటివరకు 1,49,850 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.