తెలంగాణలో 1,286 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో 1,286 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 68,946కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 563కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 1066 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 49,675కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,708గా ఉందని అధికారులు వెల్లడించారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121, కరీంనగర్ జిల్లాలో 101, మేడ్చల్ మల్కాజ్గిరి 72, వరంగల్ అర్బన్ 63, నిజామాబాద్ 59, జోగులాంబ గద్వాల 55, ఖమ్మం 41, మహబూబ్నగర్ 39, భదాద్రి కొత్తగూడెం 38, నల్గొండ 29, నాగర్ కర్నూలు 29 కేసులు నమోదయ్యాయి.






