దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు…

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం దిగి వస్తున్నాయి. 24 గంటల్లో 37,566 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వైపు 56,994 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 907 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,16,897కు పెరిగింది. ఇందులో 2,93,66,601 మంది బాధితులఱు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మొత్తం 3,97,637 మంది ప్రాణాలు వదిలారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 5,52,659 ఉన్నాయి.