దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా

దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‍తో 978 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,79,331గా ఉంది. కరోనాతో ఇప్పటి వరకు 3,96,739 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 5,72,994 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,93,09,607కి చేరింది.