దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం…

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,183 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 64,818 మంది బాధితులు కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,91,93,085 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5,95,565 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,01,83,143 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. దేశ వ్యాప్తంగా మొత్తం 31.5 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.