లక్ష దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. గత నెల రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1069 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల లక్ష 842 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545కి చేరింది. ఇందులో 9,44,996 కేసులు యాక్టివ్ ఉండగా, మరో 54,27,707 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.






