బ్రిటన్ లో ఒమిక్రాన్ తొలి మరణం

బ్రిటన్‌ను ఒమిక్రాన్ కేసులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటిదాకా కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాదన్న అంచనాలను, తాజా మరణం కలవర పెడుతోంది. ఒమిక్రాన్ బాధిత రోగి మరణించిన విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారికంగా ధ్రువీకరించారు. బ్రిటీష్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారిక లెక్కల ప్రకారం గడచిన 24 గంగల్లో 1,239 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,137కి చేరింది. ఒక్కరోజులోనే 65 శాతం కేసులు పెరిగాయి. ఇదే ఉధృతి కొనసాగితే డిసెంబర్ చివరి నాటికి ఒమిక్రాన్ కేసులు లక్షకు చేరుకునే ప్రమాదం ఉంది.