ఏపీ లో పెరిగిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,066 పరీక్షలు నిర్వహించగా.. 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,197 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 251 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,84,978కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,48,40,401 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.