అమెరికాలో ఓ అరుదైన రికార్డు…
బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లలో లక్షణాలు లేకుండా కొవిడ్ 19 వైరస్ 105 రోజులపాటు ఉన్నట్టు అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. సగటున కొవిడ్ వైరస్ లక్షణాలు 8 రోజుల్లో వెల్లడవుతాయి. క్యాన్సర్ పేషెంట్లలో కనీసం 70 రోజుల పాటు, అరుదైన ఓ కేసులో 105 రోజులపాటు ఉండటాన్ని గుర్తించమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీకి చెందిన సీనియర్ వైరాలజిస్ట్ విన్సెంట్ మాన్స్టర్ తెలిపారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 71 ఏండ్ల మహిళలో 105 రోజులపాటు ఉండటం తమకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. 105 రోజుల తర్వాత కూడా ఆమె నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోలేదని ఆయన తెలిపారు.
ఇటువంటి కేసు ఇప్పటి వరకూ రికార్డు కాలేదని ఆయన తెలిపారు. రోగనిరోధక వ్యవస్థలో లోపాల వల్ల ఇలా జరుగుతుందని ఆయన తెలిపారు. ఆమెలో యాంటీ బాడీస్ వృద్ధి కాలేదని ఆయన తెలిపారు. ఇలాంటి కేసులు ఇన్ఫ్లెంజా, మెర్స్ వైరస్ పేషెంట్లలోనూ గతంలో చూశామని ఆయన తెలిపారు.






