కరోనా చికిత్సకు మరో ఔషదం…

కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కొవిడ్-19 బారిన పడిన వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే 2-డీజీ (2డీఆక్సి-డీ గ్లూకోజ్) ఔషధాన్ని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ మార్కెట్‍లోకి విడుదల చేసింది. ముందుగా 10 వేల సాచెట్లను విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్‍డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేశాయి. 2-డీజీ మందు పొడిరూపంలో లభిస్తుంది. నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. కణాల నుంచి వైరస్‍లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది.