దేశంలో తగ్గుతున్న కరోనా…

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,20,529 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 1,97,894 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా మరో 3,380 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం 2,86,94,879కు చేరాయి. ఇందులో 2,67,95,549 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 3,44,082 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 15,55,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 22,78,60,317 మందికి వ్యాక్సినేషన్ అందించారు.