డెట్రాయిట్లో యాదాద్రి లక్ష్మీనరసింహుడికి వైభవంగా నిత్య కైంకర్యాలు
యాదాద్రి లక్ష్మీనరసింహుడికి అమెరికాలోని డెట్రాయిట్లో యాదాద్రి అర్చక బృందం నిత్య కైంకర్యాలను వైభవంగా నిర్వహించింది. డెట్రాయిట్ రాష్ట్రం నోవా పట్టణంలోని గ్లోబల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో యాదాద్రీ శుడికి నిత్యోత్సవాలు వేదమంత్ర పఠనాలతో అభిషేక పూజలు జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి తిరుకల్యాణోత్సవ పర్వాలను నిర్వహించారు. అమెరికా ఎన్ఆర్ఐవీఏ అసోసియేసన్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో యాదాద్రి దేవస్థాన ఉపప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.













