అది వచ్చినా మాస్కు తప్పదు : అమెరికన్ శాస్త్రవేత్త
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తే.. ఇక ఇష్టానుసారం తిరిగేయవచ్చని అనుకుంటున్నారా? అయితే, తప్పులో కాలేసినట్లే.. క్యాక్సిన్ వచ్చినా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసొసియేట్ డీన్, వ్యాక్సిన్ తయారీలో ప్రముఖ శాస్త్రవేత్త మరియా ఎలెనా బొట్టజ్జి సృష్టం చేశారు. వ్యాక్సిన్ అనేది ఒక వ్యక్తికి కరోనా బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుందే గానీ, వైరస్ను పూర్తిగా నిర్మూలించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాక్సినేమీ అందరికీ మాయా పరిష్కారం చూపదని, అది వచ్చిన తర్వాత జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెప్పారు. నేను ఒక వ్యాక్సిన్ తీసుకురాబోతున్నాను. దానితో పరిస్థితులు కరోనా రాక మునుపుగా మారిపోతాయని అనుకోవడం లేదు అన్నారు.













