మహిళల ఉచిత శిక్షణా కేంద్రం, విజయవాడ: మీ సహాయానికి విన్నపం
మీ సహాయానికి విన్నపం
ఆయన 92 ఏళ్ల యువకుడు. పుట్టింది మా కాకినాడ దగగ్ర ఆర్యావటం లోనే అయినా వృత్తిరీత్యా విజయవాడలో స్థిరపడి అక్కడ ప్రముఖ పౌరుడిగా పేరు పొందారు. కవి, నాటక రచయిత , సాహితీవేత్త, హాస్య చతురులుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం ‘నవ్య సాహితీ సమితి’ వ్యవస్థాపకులలో ఒకరిగా ఇప్పటికీ ఎనలేని సేవలు అందిస్తున్నారు. మా హ్యూస్టన్ వాసులు, ఆయన రెండవ కుమారుడు, ప్రముఖ శాస్త్రవేత్త డా. జగన్నాధ శాస్త్రి, కోడలు, సుప్రసిద్ద గాయని, ‘నాద వినోదిని” సంగీత సంస్థ వ్యవస్థాపకురాలు అయిన మణి శాస్త్రి కుటుంబం మాకు ఆత్మీయులు. సుమారు ముఫై ఏళ్ల క్రితం శాస్త్రి గారు హ్యూస్టన్ వచ్చినప్పుడు ఆయనతో నాకు ఎడతెగని అనుబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఆయనే వ్రాసిన నాటకాలు ఆడాం. 1989 లో హ్యూస్టన్ లో జరిగిన తానా మహాసభలు జరిగినప్పుడు ఆయన నాకు సహ సంపాదకులుగా విజయవాడ నుంచి ఆ మహా సభల సావనీర్ సంచిక రూప కల్పనలో ఎంతో సహాయం చేశారు. ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే 1994 లో ఆయన విజయవాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనానికి నన్ను అమెరికా తరఫున ఆహ్వానించినప్పుడే నా మెదడు లో చిన్న బీజం పడి, ఇంతింతై వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ వ్యవస్థాపన జరిగింది. ఆ విధంగా ఆయన నాకు స్పూర్తి ప్రదాత.
ఆయన పూర్తి పేరు కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు. మీరు ఆ పేరు వినే ఉంటారు.
ప్రస్తుత్త ప్రధాన విషయం: మహిళలకి ఉచిత శిక్షణా కేంద్రం
శాస్రి గారు సాహిత్య సేవతో పాటు సమాజ సేవలో కూడా ఎంతో ముందు ఉంటారు. ఆర్ధికంగా వెనుకబడిన మహిళలకి జీవనోపాధి కలిగించే వయోజన విద్యలు నేర్పించడానికి 2007 లో శాస్త్రి గారు, ఇతరుల సహకారంతో ప్రారంభించిన “”ఉచిత శిక్షణా కేంద్రం” ఆయన సమాజ సేవా తత్పరతకి ఒక ఉదాహరణ. ఈ ఉచిత సేవాకార్యక్రమానికి ప్రోత్సాహకంగా స్థానిక గాయత్రీ సేవా సమితి వారు విజయవాడ సత్యన్నారాయణ పురం చల్లపల్లివారివీధిలో మారుతీ వ్యాయామశాల సమీపానగల తమ రెండస్థుల భవనాన్ని ఉచితంగా వాడుకోమన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితర అమెరికా మిత్రులు, స్థానిక దాతల సహకారంతో కంప్యూటర్లు, కుట్టుమిషనులు, బల్లలు, కుర్చీలు, బీరువాలు మొదలైన అత్యవసర వస్తువులు, పరికరాలు సమకూరాయి. కనీస వేతనాలతో శాస్త్రి గారి పర్యవేక్షణ లో ముగ్గురు మహిళలు గత 12 సంవత్సరాలగా అనేక మంది బీద మహిళలకి శిక్షణ ఇస్తున్నారు. స్వయం ఉపాధి కలిగించే కుట్టు పనులు, కంప్యూటర్ లో తెలుగు DTP విద్య ఈ ఉచిత శిక్షణా కేంద్రం ప్రధాన పథకాల ద్వారా ఇప్పటికే సుమారు 1550 మంది మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడ గలుగుతున్నారు. ఇదంతా శాస్త్రి గారి చిత్త శుద్ధి, నిజాయితీ కూడిన అసమాన కృషి, మీ సహృదయుల సహకారంతో సాధ్యం అయింది.
చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే శాస్త్రి గారు స్వయంగా తానే మహిళలకి కంప్యూటర్ లో తెలుగు టైప్ చెయ్యడం నేర్పిస్తారు. ఈ ఉచిత శిక్షణా సంస్థ ఫోటోలు, ప్రముఖ దిన పత్రిక “ఈనాడు” లో “సమాజ సేవలో మూడు దశాబ్దాలు” అనే మకుటంతో ప్రచురించబడిన ప్రశంసాపూర్వక వార్తా కథనం మొదలైనవి కొన్ని ఇక్కడ జతపరిచాను…మీ కోసం.
మీ ఆర్ధిక సహకారానికి మా విన్నపం
విజయవాడలో గత 12 సంవత్సరాలగా, లాభాపేక్ష లేకుండా విజయవంతంగా నిర్వహించ బడుతూ, వందలాది వెనుకబడిన మహిళలకి స్వయం ఉపాధి కలిగే కంప్యూటర్ లో తెలుగు, కుట్టు విద్య ఉచితంగా నేర్పిస్తున్న ఈ సంస్థ నిర్వహణ ఖర్చు నెలకి సుమారు $250 (15000 రూపాయలు.) ఈ నిర్వహణా వ్యయం, అవసరం అయిన మరి కొన్ని కంప్యూటర్లు, కుట్టు మిషన్ల కొనుగోలుకీ వదాన్యులైన మీ విరాళాలు అర్దిస్తున్నాం. అమెరికాలో విరాళాలకి పన్ను రాయితీ లభిస్తుంది. గత 12 సంవత్సరాలగా ఈ సంస్థ మీ వంటి వదాన్యుల దాతృత్వం వలననే నిరాటంకంగా సేవలు అందించగలుగుతోంది.
ఆర్ధికంగా వెనుకబడిన మహిళలు తమ కాళ్ళ మీద తామే నిలబడే అవకాశం కలిగిస్తున్న ఈ ఉచిత శిక్షణా కేంద్రానికి మీ ప్రోత్సాహాన్నీ, ఆర్ధిక సహాయాన్నీ అర్ధించడమే ఈ ఉత్తరం సారాంశం.
Appeal for Your Financial Support
We request generous donations in USA or India to help pay for the monthly maintenance expenses and to purchase additional computers & sewing machines for training purposes at our free vocational training center for under privileged women in Vijayawada/Amaravathi. All donations in USA are tax-deductible. No amount is too small. Your generous support is instrumental in teaching income generating skills in computer DTP and tailoring to poor and lower middle class women and help them become economically independent. About 1550 women benefitted from our free vocational educational services since 2007.
HOW TO DONATE IN USA
(All donations are tax-deductible in USA. Federal Tax ID: 76-0444238)
(We appreciate your kind support by July 15, 2019)
On-Line
You can click on or copy & paste the following URL and follow the prompts. You can donate in any currency using any credit card.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=2FDPXVR7YJ5M8&source=url
OR
Log on to www.vangurifoundation.blogspot.com , and click on the DONATE button and follow the prompts.
BY CHECK
Please make check payable to Vanguri Foundation of America and mail to
Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497
HOW TO DONATE IN INDIA
You can also donate generously in Indian Rupees by Bank Transfer as follows:
Canara Bank Laxmi Nagar Branch, Vijayawada 520011
K.Virabhadra Sastri
A/c 6071101001943
ISFC Code: CNRB0006071
మీ సత్వర స్పందనకు, దాతృత్వానికి ముందుగానే మా ధన్యవాదాలు.
For more infomration, please contact
వంగూరి చిట్టెన్ రాజు: (Houston, TX)
Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
వీరభద్ర శాస్త్రి
ఫోన్: 917013248081, E-mail: kvbsastri@gmail.com













