మరోసారి ట్రంప్- కిమ్ భేటీ !
ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆ లేఖ చాలా పాజిటివ్‌గా ఉందని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని నెలల క్రితం ఇద్దరు నేతలూ సింగపూర్‌లో చరిత్రాత్మక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ విధమైన సంబంధాలనే మునుముందు కొనసాగించాలిన ఆశిస్తున్నట్లు తాను రాసిన లేఖలో కిమ్ కోరారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు కట్టబడి ఉందని ఆ లేఖ సృష్టం చేస్తోందని వైట్‌హౌజ్ ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు. మరోసారి ట్రంప్‌ను కలవాలని కిమ్ ఆశిస్తున్నట్లు ఆ లేఖ ద్వారా తెలిసిందని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు ఇదే నిదర్శనమని సారా అన్నారు.













