బోల్టన్ పుస్తకాన్ని ప్రచురించొద్దు : వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ రాసిన పుస్తకాన్ని ప్రచురించరాదని వైట్‌హౌస్ ఆదేశించింది. రహస్య చట్టాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని సృష్టం చేశారు. బోల్టన్ పుస్తకాన్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రాథమికంగా సమీక్షించింది. ఇందులో రాసిన పలు అంశాల్లో అధ్యక్షునికి సంబంధించి అత్యంత రహస్య సమాచారం ఉందని పేర్కొంది. వీటిని తొలగించకుండా ఈ పుస్తకాన్ని ప్రచురించడం గానీ, బహిర్గతం చేయడం గానీ చేయకూడదని బోల్టన్ తరపు న్యాయవాది చార్లెస్ కూపర్‌కు సృష్టం చేసింది.













