వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ సరికొత్త రికార్డు
సూపర్‌ఫాస్ట్ బస్సులు వచ్చాయ్. సూపర్ ఫాస్ట్ రైళ్లు వచ్చాయ్. ఇప్పుడిక సూపర్‌ఫాస్ట్ విమానాల వంతు వచ్చేసింది. తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ వేగవంతమైన విమానం వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ 8ను రంగంలోకి దించింది. ఆ విమానం స్పీడ్ ధ్వని వేగం (గంటకు 1234 కిలోమీటర్లు) కన్నా ఎక్కువ. గంటలోనే 1289 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ విమానాన్ని లాస్ఏంజెలిస్-లండన్ మధ్య నడపనుందీ సంస్థ. వాణిజ్య విమనాలకూ సాధ్యం కాని వేగంతో 35 వేల అడుగుల ఎత్తులో ఈ విమానం గాలిని చీల్చుకుంటూ వెళ్తుందని వర్జిన్ అట్లాంటిక్ తెలిపింది.













