వాడివేడిగా అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఘోరంగా విఫలమైదని డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆరోపించారు. కరోనా 2 లక్షలకు పైగా అమెరికన్లను బలితీసుకుందని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలు చేసినందని గుర్తు చేశారు. ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల అమెరికన్లు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ పెన్స్‌తో ముఖాముఖీ చర్చ సందర్భంగా ఆమె ట్రంప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉటా రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ సిటీలో ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ వాడివేడిగా సాగింది. చైనాతో వాణిజ్యపరంగా ట్రంప్ సర్కారు తలపడినా పరాజయమే మిగిలిందన్నారు. దీంతో 3 లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ట్రంప్ ఆదాయపు పన్ను 750 డాలర్లే చెల్లించారని హరిస్ ఆరోపించారు. 2 కోట్ల మందికి లబ్ది చేకూర్చే ఒబామా కేర్‌ను ట్రంప్ రద్దు చేశారన్నారు. తిరిగి ఎన్నుకునే అర్హతను ట్రంప్ ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు.
90 నిమిషాల ఈ చర్చ ఆరంభంలో వెనకబడిన మైక్ పెన్స్ తర్వాత దూకుడు పెంచారు. ఈ ఏడాది దేశం పెనుసవాళ్లను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అమెరికన్ల ఆరోగ్యనికి ట్రంప్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పార. కోవిడ్ వ్యాప్తికి చైనాను నిందించారు. ఒబామా హెల్త్‌కేర్ విఫలమైందునే రుద్ద చేశామని వివరించారు. వ్యాపారవేత్త అయిన ట్రంప్ మిలియన్ డాలర్లు ఆదాయ పన్నుగా చెల్లించారని చెప్పారు.













