మోదీతో కలిసి పనిచేస్తాం … అమెరికా

వరుసగా రెండోసారి భారీ విజయాన్ని అందుకున్న మోదీకి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు దేశాధినేతలు ఆయనకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత్తో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాజాగా మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ ట్రంప్ కార్యాలయ అధికారి ప్రకటించారు. అమెరికా భారత్ అత్యంత సన్నిహితదేశం అని పేర్కొన్నారు. అనేక అంశాలపై భారత్తో చర్చించడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధికార ప్రతినిధి మోర్గన్ ఓర్టగస్ పలు అంశాలను వెల్లడించారు. అలాగే భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.











































































