పాకిస్థాన్‌కు పెద్ద షాక్
పాకిస్థాన్‌కు పెద్ద షాకే ఇచ్చింది అమెరికా. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకొనే వరకు ఎలాంటి రక్షణ సాయం చేయబోమని ప్రకటించింది. 115 కోట్ల డాలర్ల (సుమారు రూ.7289 కోట్లు) సాయాన్ని నిలిపేసింది. ఆప్ఘన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను నిర్మూలించాలని సృష్టం చేసింది. ఎన్నో ఏళ్లుగా అమెరికా నేతలను పిచ్చోళ్లను చేస్తూ పాకిస్థాన్ అబద్దాలు చెబుతూ మోసం చేసిందని అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏమాత్రం సాయం చేయబోమని కూడా ఆయన సృష్టం చేశారు. అందుకు తగినట్లే అమెరికా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం నిలిపేసిన సాయంలో ఫారిన్ మిలటరీ ఫండింగ్ కింద ఇవ్వాలని 2016లో కాంగ్రెస్ ఆమోదించిన 25.5 కోట్ల డాలర్లు కూడా ఉన్నాయి. ఇక 2017 ఏడాదికి ఇవ్వాల్సిన 90 కోట్ల డాలర్ల కొలిషన్ సపోర్ట్ ఫండ్‌ను కూడా నిలిపేసింది అమెరికా రక్షణ శాఖ. దక్షిణాసియాలో సుస్థిరతను చెడగొట్టడంతో పాటు ఆఫ్ఘన్లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుంటునన తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌ల నిర్మూలనకు పాక్ చర్యలు తీసుకునే వరకు రక్షణ సాయాన్ని నిలిపేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హీదెర్ నేయెర్ట్ వెల్లడించారు. అయితే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై చర్యలకు దీంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన సృష్టం చేశారు.













