ఆయుధాలు తరలిస్తున్న అమెరికా
అమెరికా యుద్ధ సన్నాహాల్లో తలమునకలైంది. ఇప్పటికే దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి యూఎస్ఎస్ మిచిగన్ వారం క్రితమే దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నావికా దళం అధికారిక ఫేస్బుక్ పేజ్‌లో పేర్కొంది. ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ చర్యను చేపట్టింది. ఇప్పటి వరకు ఉత్తర కొరియా విషయంలో అమెరికా చేపట్టిన తీవ్రమైన చర్య ఇదేనని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జలాంతర్గామి అణువార్ హెడ్స్‌ను దక్షిణ కొరియాకు చేర్చి ఉంటుందని వీరు భావిస్తున్నారు. సుదూర లక్ష్యాలను తాకే క్షిపణులు ఈ సబ్‌మెరైన్‌లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉత్తర కొరియా కలవర పడాల్సిన అంశమే.













