కరోనా దెబ్బకు 3 కోట్ల ఉద్యోగాలు పోయాయ్
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆతలాకుతలమవుతున్నది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికాలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం కారణంగా మే నెలలో కొత్తగా 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 2.5 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 20 శాతానికి చేరుతుందని అంచనా. పెద్ద వయసున్నవారిలో దాదాపు సగానికి తక్కువ మంది మాత్రమే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరిస్తున్నా ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకునే స్థితిలో సంస్థలు లేవు.













