కమలా హారిస్ ఇన్-పర్సన్ ప్రచారానికి తాత్కాలిక బ్రేక్
అమెరికా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం కోవిడ్-19 క్వారంటైన్ నుంచి బయటకి వచ్చి ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీ అభ్యర్థుల మాటల తూటాలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరు మీద సాగుతున్న సమయంలో డెమోక్రాటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నామినే కమలా హారిస్ ఇన్-పర్సన్ ప్రచారానికి తాత్కాలికం గా బ్రేకులు పడ్డాయి.
సెనెటర్ కమలా హారిస్ తో కలిసి డెమోక్రాటిక్ పార్టీ ప్రచార కార్యక్రముమ్ లో పాల్గొంటున్న సెనెటర్ హారిస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ లీజ్ అల్లెన్ మరియు సెనెటర్ హారిస్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో ఒక సిబ్బందికి గురువారం 15 అక్టోబర్ న అధికారులు కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారించదం తో పార్టీ అధికారులు వైస్ ప్రెసిడెంట్ నామినే కమలా హారిస్ ఇన్-పర్సన్ ప్రచారాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. సెనెటర్ హారిస్ తన సిబ్బంది తో కలిసి ప్రయాణించినప్పటికీ సామాజికదూరం పాటించడమే కాకుండా తగిన జాగర్తలు తీసుకున్నారు అని అందుకు సెనెటర్ హారిస్ కి కోవిడ్ -19 నెగటివ్ నిర్ధారణ అయింది అని పార్టీ అధికారులు తెలిపారు.
సెనేటర్ హారిస్ గురువారం 15 అక్టోబర్ నార్త్ కరోలినాలో మరియు శుక్రవారం 16 అక్టోబర్ న ఒహియోలో ప్రచారం చేయవలసి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ రద్దు చేయగా ఆమె సోమవారం 19 అక్టోబర్ నుంచి ప్రచార బాటలో తిరిగి రావాలని భావిస్తోంది పార్టీ అధికారులు తెలిపారు.
సెనెటర్ హారిస్ కి కోవిడ్ -19 నెగటివ్ నిర్ధారణ అవ్వడమే కాకుండా లిజ్ అలెన్ మరియు ఫ్లైట్ సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణకు రెండు రోజుల ముందు సెనేటర్ హారిస్ ఈ వ్యక్తులలో ఎవరితోనూ సన్నిహితంగా లేనందున సెనేటర్ హారిస్ కి క్వారంటైన్ అవసరం లేదు అని C.D.C నివేదికలో పేర్కొన్నట్టు అంతే కాక సెనేటర్ హారిస్ కి కోవిడ్-19 నెగిటివ్ నిర్ధారణ ఐనప్పటికీ ప్రచారం లో పాలుగునే సిబ్బది ఆరోగ్య దృష్ఠ్య మేము ఆదివారం 17 అక్టోబర్ వరకు సెనేటర్ హారిస్ ప్రయాణాన్ని రద్దు చేస్తున్నాము అని బిడెన్ కాంపెయిన్ మేనేజర్ జెన్నిఫర్ ఓ’మాలీ దిల్లోన్ తెలిపారు.
“నేను స్వీకరించే పరీక్ష ఫలితాల గురించి నేను మీతో పారదర్శకంగా ఉంటాను” అని సెనేటర్ హారిస్ ట్విట్టర్ ద్వార ప్రజలకి తెలిపారు.













