సిలికానాంధ్రకు రవిప్రకాష్ భారీ విరాళం
కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర గ్రామంలో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవిని ఆసుపత్రి నిర్మాణానికి తెలుగునాట న్యూస్ టెలివిజన్ రంగంలో పేరుగాంచిన టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ రూ.4కోట్లను విరాళంగా అందించారు. దివిసీమలోని 150 గ్రామాల ప్రజలకు ఆధునిక వైద్యసదుపాయాలను మరింత చేరువ చేసే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రికి ప్రధాన పోషకులుగా రవిప్రకాష్‌ను సిలికానాంధ్ర ఆదరిస్తుందని కూచిపూడి నాట్యారామం చైర్మన్, సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గడిచిన దశాబ్ద కాలంగా సిలికానాంధ్ర సంస్థకు రవిప్రకాష్ ఎంతో చేయూతనిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













