ఓ విశిష్ట అతిథిని ఆహ్వానించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోకి ఓ విశిష్ట అతిథిని ఆహ్వానించారు. ఆ అతిథి ఎవరో కాదు జిహాదీ గ్రూపు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) చీప్ అబు బకర్ అల్ బగ్దాదీని పట్టించిన శునకం. ఇది కోనన్.. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ శునకం అంటూ స్వయంగా ట్రంప్ ఆ శునకం గురించి తెలిపారు. ట్రంప్ తన భార్య మెలానియా, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌తో కలిసి కోనన్తో సరదాగా గడిపారు. ఆ శునకం ట్రయినర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనన్ ఇక్కడ ఉన్నందుకు మాకెంతో గౌరవంగా ఉంది. ఈ శునకానికి సర్టిఫికేట్, అవార్డు ఇచ్చాం. వీటిని మేం వైట్‌హౌస్‌లో ఉంచబోతున్నాం అంటూ ట్రంప్ విలేకర్లతో అన్నారు. కోనన్ నిజమైన హీరో అంటూ వైస్ ప్రెసిడెంట్ పెన్స్ పేర్కొన్నారు. బాగ్దాదీని మట్టబెట్టే ఆపరేషన్‌లో ఈ శునకం అద్భుతమైన సేవలందించింది. భయంతో బాగ్దాదీ తనని తాను పేల్చుకొనే క్రమంలో ఈ శునకానికి స్వల్ప గాయాలయ్యాయి.













