ఆ లేఖ కోసం ఎదురుచూస్తున్నా : ట్రంప్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నుంచి సందేశంతో కూడిన లేఖ వస్తుందని దాని కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కిమ్ పంపించే లేఖలో ఏముందో చూడాలని ఆసక్తిగా ఉంది. నేటికి కిమ్ పంపించిన లేఖ వాషింగ్టన్ డీసీకి చేరుకుంటుంది. దాని కోసం ఎదురుచూస్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో పాటు న్యూయార్క్లో అమెరికా, ఉత్తరకొరియాకు చెందిన నేతలు భేటీ అవుతారని ఆయన వెల్లడించారు. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, ఉత్తరకొరియా ప్రతినిధి కిమ్ యాంగ్ చోల్ మధ్య సమావేశం జరుగుతుంది.













