సరిహద్దు గోడ నిర్మాణ పనులను పరిశీలించిన ట్రంప్
అమెరికా-మెక్సికో సరిహద్దు ప్రాంతాలలో నిర్మిస్తున్న సరిహద్దు గోడ పనులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలించారు. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవటానికి నిరాకరిస్తున్న కాలిఫోర్నియా ప్రభుత్వం మొత్తం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా కాలిఫోర్నియాకు వచ్చిన ట్రంప్‌కు ఈ సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ప్రదర్వనలు చేస్తున్న స్థానికులు ఆయనకు నిరసనలతో స్వాగతం పలికారు. అక్రమ వలసదారులపై చర్యల విషయంలో ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్న సమయంలో ట్రంప్ ఇక్కడికి రావటం గమనార్హం.













