మెక్సికో సరిహద్దులో కందకాలు : ట్రంప్
భారీ గోడను నిర్మించి అమెరికా-మెక్సికో సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు సంకల్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వైపు నుంచి వలసలను అరికట్టేందుకు క్రూరమైన నిర్ణయమే తీసుకున్నారు. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే వారిపైకి కాల్పులు జరపాలని ఆదేశించారు. వైట్‌హౌస్ అధికారుల వివరాల ఆధారంగా మెక్సికో సరిహద్దు గుండా గోడతో పాటు, సమాంతరంగా కాలువనూ తవ్వి… అందులో విషపూరితమైన పాములను, మొసళ్లను వదలాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు. అలాగే గోడను తాకితే కరెంట్ షాక్ కొట్టేలా ఏర్పాట్లుండాలని, గోడను దాటేందుకు ప్రయత్నిస్తే శరీరం లోతుల్లోకి దిగేలా పదునైన చువ్వలను పాతాలని ట్రంప్ ఆదేశించారు.













