పాంపియో ఉత్తర కొరియా పర్యటన రద్దు
ఉత్తర కొరియాలో వచ్చే వారం జరగాల్సిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పర్యటనను అధికారిక ప్రకటన వెలువడిన మరుసటి రోఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఉత్తర కొరియా చేపట్టిన అణు నిరాయుధీకరణ ప్రక్రియాలో ఆశించిన వేగం కన్పించటం లేదని, అందువల్ల చర్చలు జరిపినా నిష్ప్రయోజనమని భావించి ఈ పర్యటనను రద్దు చేస్తున్నామని ట్రంప్ ఒక ట్విట్లో వెల్లడించారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ ప్రక్రియాలో ఆశించినంత వేగం కన్పించటం లేదని భావివచినందున విదేశాంగ మంత్రి పాంపియోను ఉత్తర కొరియా వెళ్లవద్దని సూచించినట్లు పేర్కొన్నారు.













