క్లిష్ట ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కొరత లేకుండా అమెరికా నివారణ చర్యలు
అగ్ర రాజ్యం గా ఉన్న అమెరికా, కొన్ని ముఖ్యమైన ఔషధాలను, వైద్య సామాగ్రి మరియు వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇకనుంచి అమెరికాకు ఆ అవసరం ఉండదు ఎందుకుఅంటే అమెరికా లోని అమెరికన్ ఫ్యాక్టరీస్ తాయారు చేసే క్లిష్ట ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అమెరికా కొనుగోలు చేయనుంది.
గురువారం 6 ఆగస్ట్ న ముఖ్యమైన క్లిష్ట ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను ముఖ్యంగా కరోనా వైరస్ కి సంబంధించిన మాస్కులు, పరీక్షా పరికరాలు మరియు కొన్ని ఔషధాలను, ఫెడరల్ గవర్నమెంట్ అమెరికన్ ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతించే ఉత్తర్వులు పై అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా లో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే అయితే కరోనా పరీక్షా పరికరాలు, మాస్కుల కొరత ఉన్నట్లు వార్తలు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో అమెరికాకు ఎగుమతి చేసే దేశాలు కూడా కరోనా వైరస్ వైద్య సామాగ్రి కొరతను ఎదురుకున్నాయి. దీంతో అమెరికా కరోనా వైరస్ వైద్య సామాగ్రి కొరత ఏర్పడినట్లు తెలిసింది. కరోనా వైరస్ వైద్య సామాగ్రి కొరత పై ప్రతిపక్ష పార్టీలు అద్ధ్యక్షులు ట్రంప్ పై మండిపడ్డారు. వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మార్చి నెలలో ఈ ప్రతిపాదనను అద్ధ్యక్షులు ట్రంప్ ముందు పెట్టగా ఔషధ లాబీయిస్టులు, వ్యాపార సమూహాలు మరియు ఆర్థికవేత్తల నుండి ఈ ప్రతిపాదన అమలు చేస్తే సప్లై చైన్ దెబ్బతినే అవకాశం మరియు ఓషధ ధరలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది అని వ్యతిరేకత రావటం తో ప్రతిపాదనకు ఆమోదం తెలపడానికి కొన్ని నెలలు పట్టినట్లు తెలిసింది.













