ఆ ఆధికారం రాష్ట్ర గవర్నర్లకే : ట్రంప్
కరోనా మహమ్మారితో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడంచెల ప్రణాళికను ఆవిష్కరించారు. లాక్డౌన్ ఆంక్షలను మూడు విడుతలుగా సడలించాలని ప్రతిపాదించారు. ఆ అధికారాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే అప్పగించారు. గత వారం మరో 52 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దేశ కార్మిక విభాగం ప్రకటించిన రోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా కారణంగా అమెరికాలో ఒక మార్చి నెలలోనే 2.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. కాగా కరోనా వల్ల గత 24 గంటల్లో 4,591 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలోనే ఒక్కరోజులో ఇవే అత్యధిక మరణాలు.













