దక్షిణ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దక్షిణ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు స్వేతసౌధం అధికారులు ఒక ప్రకటనను జారీ చేసారు. సిరియాలో రష్యా రసాయన దాడులకు పాల్పడిందన్న ఆరోపణలు వస్తుండటంతో సిరియా వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ట్రంప్ నిర్ణయించుకున్నారని, ప్రపంచంలో వివిధ దేశాలలో వేగంగా వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించే పనిలో వౌట్‌హౌస్ తలమునకలై ఉందదని అమెరికా మీడియా తెలిపింది. భద్రతా కారణాలు, సిరియాలో వస్తున్న మార్పులు, పర్యటనకు రద్దు కారణాలు కావచ్చని తెలుస్తోంది. అమెరికన్స్ ఇన్ లిమా 8వ సదస్సులో ట్రంప్ పాల్గొనాల్సి ఉంది. ట్రంప్ చేయాల్సిన పర్యటనను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చేస్తారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.













