ఆమె కమ్యూనిస్టు.. సోషలిస్టు కాదు : ట్రంప్
కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే మళ్లీ ప్రజాజీవితంలోకి రానున్నారు. ఈ శనివారం ఆయన ఫ్లోరిడాలో ర్యాలీ నిర్వహిస్తారని ఊహాగాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన వైట్‌హౌజ్ నుంచి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బైడెన్ గెలిస్తే, అప్పుడు కమ్యూనిస్టు కమలా హారిస్ నెలలోపే పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంటుందని ట్రంప్ ఆరోపించారు. కమలా కమ్యూనిస్టు అని, ఆమె సోషలిస్టు కాదు అని, అభిప్రాయాలను ఓసారి పరిశీలించండి, సరిహద్దుల్ని ఓపెన్ చేసి.. హంతకులను, రేపిస్టులను దేశంలోకి ఆహ్వానించాలనుకున్నదని ట్రంప్ ఆరోపించారు. కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థుల చర్చలో పాల్గొన్న తర్వాత ట్రంప్ ఈ కామెంట్ చేశారు. మనకు ఓ కమ్యూనిస్టు నేతగా రాబోతున్నారని, నేను జోసెఫ్ బైడెన్‌తో చర్చల్లో పాల్గొన్నానని ఆయన రెండు నెలల కన్నా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా చేయలేరని, అది నా అభిప్రాయం అని ట్రంప్ అన్నారు.













