ఉత్తర కొరియాకు డొనాల్డ్ ట్రంప్ షాక్!
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉత్తర కొరియా పర్యటన అర్థాంతరంగా రద్దయింది. ఆయనను ఉత్తర కొరియా వెళ్లవద్దంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. అణు నిరాయుధీకరణ ఒప్పందం ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కొరియా వెళ్లరాదని విదేశాంగ మంత్రి మైక్ పాంపియోను కోరాను. అణునిరాయుధీకరణ ప్రక్రియపై మేము తగిన విధంగా ముందుకెళ్లలేకపోతున్నామని నేను భావిస్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదం కారణంగా అణునిరాయుధీకరణ ప్రక్రియపై దృష్టి పెట్టలేకపోతున్నామనీ, ఒక్కసారి ఈ వివాదం ముగిసిన తర్వాత ఉత్తర కొరియ పర్యటనపై మళ్లీ షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.













