TRS NRI ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన మహేష్ బిగాల
TRS USA NORTH EAST కోర్ టీం సభ్యుల సమావేశాన్ని TRS USA కన్వీనర్ శ్రీనివాస్ గనగోని, తెరాస – న్యూజెర్సీ శాఖ ఇంచార్జి మహేష్ పొగాకు, దేవేందర్ రెడ్డి మీడియా ఇంచార్జి ఏర్పాటు చేసారు. టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల గారు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమంలో మహేష్ బిగాల గారు మాట్లాడుతూ ప్రవాస తెరాస NRI సభ్యులు అందరు ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత 4 సంవత్సరాల కాలంలో మన కెసిఆర్ గారి నాయకత్వంలో విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ప్రతిపక్ష పార్టీల విష ప్రచారానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వెయ్యాలని పిలుపునిచ్చారు. ఆలాగే NRI PROXY వోటింగ్ ప్రక్రియ గురించి ప్రవాస తెలంగాణ బిడ్డలకు వివరించి, అవగాహనా కల్పించాలని తెలిపారు. గల్ఫ్ లో అక్రమంగా ఉంటున్న, తెలంగాణ బిడ్డలు క్షమాబిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని, కేటీర్ గారు పిలుపునిచ్చారని సాయం పొందాలనుకునేవారు +71565463903 లేదా 9440854433 హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చెయ్యాలని తెలిపారు. ఎన్నారైలకు ప్రభుత్వ పథకాలను ఉపోయోగించుకోవడం కొరకు హెల్ప్ లైన్ ప్రవేశపెట్టిన ఎన్నారై మంత్రి కేటిఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
గల్ఫ్ లో ఉన్న, అన్ని తెలంగాణ సంఘాలు ఈ విషయంలో చొరవ తెసుకోవాలని తెలిపారు. ఇటీవల కేరళ లో వరద వల్ల కలిగిన బాధితులకు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
శ్రీనివాస్ గనగోని కొత్త సభ్యులు శ్రీధర్ గుడాల, రామ్ మోహన్ చిన్నల, అరుణ్ అర్కల, కృష్ణ సిద్ధ్ద, దశరథ్ రెడ్డి, భాస్కర్ పిన్న, సాయి సోమిశెట్టి లకు స్వాగతం పలికారు. ఈ సమావేశం లో మొదటగా భారత్ రత్న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి మరియు కేరళలో వరదలకు క్షతగ్రాత్రులైన వారికీ మౌనం పాటించి నివాళిలు అర్పించారు.
మహేష్ పొగాకు మాట్లాడుతూ 32దేశాలలో టిఆర్ఎస్ శాఖలు స్థాపించినందుకు మహేష్ బిగాల ను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమం తెరాస USA Advisory చైర్మన్ మహేష్ తన్నీరు, కన్వీనర్ జలగం వెంగల్, Ravi Dannapaneni, సెక్రటరీ అరవింద్ తక్కళ్లపల్లి పర్యవేక్షణలో ఏర్పాటు చేసారు. మీడియా ఇంచార్జి దేవేందర్ రెడ్డి సమావేశానికి హాజరైన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.













