పెంటగాన్ ప్రతినిధి రాజీనామా
అమెరికా రక్షణశాఖ పెంటగాన్ ఉన్నత స్థాయి అధికార ప్రతినిధి డానా డబ్ల్యు వైట్ తన పదవికీ రాజీనామా చేశారు. రక్షణ మంత్రి జిమ్ మాటిస్ తన పదవికీ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే వైట్ కూడా తన రాజీనామాను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జిమ్ మాటిస్తో కలిసి దేశానికి సేవలందించే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, తనకు సహకరించిన సహచరులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. వీరిరువురు రాజీనామా చేశారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి ధృవీకరించారు. ఆమె స్థానంలో ఛార్లెస్ ఇ సమ్మర్స్ (జూ) పెంటగాన్ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారని ఆయన వివరించారు. బోయింగ్ విమాన తయారీ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు పాట్రిక్ షనాహన్ మాటిస్ స్థానంలో అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.













