టిఎల్‍సిఎ ఫాదర్స్ డే…ప్రముఖుల హాజరు

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలను ఇటీవల వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు సంఘల నాయకులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి తగ్గినతరువాత ఇప్పుడిప్పుడే కార్యక్రమాలను బహిరంగంగా నిర్వహిస్తున్నారు. టిఎల్‍సిఎ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, టిటిఎ ఫౌండర్ డా. పైళ్ళ మల్లారెడ్డి, టిఎల్‍సిఎ అధ్యక్షుడు ఉదయ్‍కుమార్ దొమ్మరాజు, వైస్ ప్రెసిడెంట్ జయప్రకాశ్, ట్రస్టీలు రావు వోలేటి తదితరులు పాల్గొన్నారు.