TLCA: టీఎల్‌సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) 2026 సంవత్సరానికి కార్యవర్గ కమిటీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఎన్నికలు పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతాయని టీఎల్‌సీఏ తెలిపింది. సభ్యులు నామినేషన్ ఫారాలను ఈమెయిల్ ద్వారా లేదా టీఎల్‌సీఏ (TLCA) అధికారిక వెబ్సైట్ www.tlca.com నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నామినేషన్ ఫారాలు ఇంకా అందుకోని సభ్యులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కార్యదర్శికి పంపి అప్డేట్ చేసుకోవాలని ఎన్నికల కమిటీ కోరింది. ఈ (TLCA) ఎన్నికల కమిటీలో సంపత్ దామినేని, రామ్ జోగ ఎరాంకి, మనోహర్ చిల్లర సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, సభ్యులు 516-984-2810 నంబర్‌కు కాల్ చేసి వాటిని నివృత్తి చేసుకోవాలని కమిటీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గం 2026లో (TLCA) టీఎల్‌సీఏ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.