డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన గౌరవం!
ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ మరోసారి తన ఎడిషన్‌లో కవర్ పేజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసమే కేటాయించింది. దానిమీద ట్రంప్ మహారాజులా దర్శమిస్తున్నారు. ఆ మ్యాగజైన్ మీద ట్రంప్ అద్దం చూసుకుంటున్నట్లు కనిపిస్తారు. అందులో మనకు కనిపించే ప్రతిబింబంలో ఆయన కిరీటాన్ని, నూలుతో తయారు చేసిన పొడువాటి వస్త్రాన్ని ధరించి దర్శనమిస్తారు. దానికి సంబంధించిన కథానానికి కింగ్ మి విజన్ అబ్సల్యూట్ పవర్ శీర్షిక పెట్టారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక సలహాదారు రాబర్ట్ ముల్లర్ పై శ్వేత సౌధం చేసిన దాడులను అందులో ప్రస్తావించారు. రష్యా పాత్రపై దర్యాప్తు చేస్తోన్న వారిని ట్రంప్ శిబిరం అప్రతిష్ఠ పాలు చేయడంలో విజయం సాధించవచ్చు. కానీ అది అమెరికా ప్రజాస్వామ్యాన్ని కూడా దిగజార్చుతుంది అని టైమ్ తన ట్విటర్లో రాసుకొచ్చింది. 2017లో జనవరి, మార్చి కవర్ పేజ్‌ల మీద ట్రంప్‌ను పెద్ద నీటిని ప్రవాహం ముంచేస్తున్నట్లు శ్వేతసౌధంతో అతడికున్న గందరగోళ సంబంధాలు వెల్లడించేలా డిజైన్ చేశారు.













