నెయిల్ పాలిష్ ధర కోటి రూపాయలా?
అమెరికాకు చెందిన ఓ సంస్థ తయారు చేసిన నెయిల్ పాలిష్ ధర తెలిస్తే అవక్కైపోతారు. అదెంతో తెలుసా. అక్షరాల కోటి రూపాయలు. ఈ ధర విన్న వాళ్లు వామ్మో అంటూ నోళ్లు తెరుస్తున్నారట. త్వరలో మార్కెట్ల్లోకి రానున్న ఈ నెయిల్ పాలిష్ ధర అక్షరాల 1 కోటి 36 లక్షల 66వేల రూపాయలు. లాస్ ఏంజెల్స్‌కు చెదిన అజాతురె అనే కంపెన్నీ దీన్ని తయారు చేసింది. మరీ ఇంత ధర ఎందుకో తెలుసా? 267 క్యారెట్ల బ్లాక్ డైమండ్‌తో దీన్ని తయారు చేశారు. వచ్చే నెల దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. సంపన్న వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ నెయిల్ పాలిష్ తయారు చేసిందీ కంపెనీ. ప్రపంచంలోనే ఖరీదైన గోళ్ల రంగు ఇది.













