MATA: రవీంద్ర భారతిలో దాము గేదెల 70వ జన్మదిన వేడుకలు
అమరావతి: హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా మన అమెరికా తెలుగు సంఘం (MATA) కో కన్వీనర్ దాము గేదెల గారి 70వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సభలో రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు.
మరోవైపు, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడమే లక్ష్యంగా మాతా (MATA), ఐడల్ గంధర్వ నేషనల్ & ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ‘ఐడల్ గంధర్వ’ జాతీయ, అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం – 2025ను ఘనంగా నిర్వహించాయి. ఘంటసాల గాన మాధుర్యాన్ని స్మరించుకుంటూ జరిగిన ఈ వేడుకలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ వందనం, పురస్కారాల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దాము గేదెల, స్వర గంధర్వ గాయకులు మొగలేశ్వరరావు, ఐడల్ గంధర్వ వ్యవస్థాపకులు డాక్టర్ బి. శరత్ చంద్ర, ప్రముఖ వాగ్గేయకారులు సుభాష్ చంద్రబోస్, అంతర్జాతీయ గాయకులు మధు అన్న తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి, గాన గంధర్వ ఘంటసాల 103వ జయంతి, మహానటి సావిత్రి 91వ జయంతి, మూవీ మొఘల్ పద్మ విభూషణ్ డాక్టర్ డి. రామానాయుడు 82వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
సేవా కార్యక్రమాల విషయానికి వస్తే, మాతా సేవా దినోత్సవాల్లో భాగంగా నవంబర్ 26న విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని లెబెన్షెల్ఫ్ (Lebenshilfe) పాఠశాలలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మాతా వ్యవస్థాపకులు, మాజీ అధ్యక్షులు గనగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 700 మంది అంధ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మాటా కో-కన్వీనర్ దాము గేదెలతో కలిసి ప్రముఖ సినీ నటి రోజారమణి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు తమ మద్దతును తెలియజేశారు.






