ఆమ్నెస్టీ బాధితుల సహాయం కొరకు యూఏఈ కి బృందం – మంత్రి కేటీర్
11 మంది యూఏఈ ఆమ్నెస్టీ బాధితులు తెలంగాణాకి రాక
-స్వంత ఖర్చులతో తెప్పించిన టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
-ఎన్నారైలకు రైతుబంధు చెక్స్ నిబంధనలను సడలించినందుకు ధన్యవాదాలు తెలిపిన టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఎన్నారై మంత్రి కేటీర్ గారిని కలిసి ఎన్నారైలకు రైతుబంధు చెక్స్ నిబంధనలను సడలించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ నిబంధనలు ముఖ్యంగా గల్ఫ్ లో వున్నా ఎన్నారైలకు తోడుపడుతుంది.వాళ్లు తెలంగాణాకి రాకుండానే వారి తల్లితండ్రుల ద్వారా చెక్స్ పొందవచ్చు.
ఈ సదుపాయం కల్పించినందుకు అందరు ఎన్నారైల తరుపున కృతజ్ఞతలు అన్నారు.
టిఆర్ఎస్ ఎన్నారై తరుపున 11 మంది యూఏఈ ఆమ్నెస్టీ బాధితులను మానవతా దృక్పధంతో స్వంతగా విమాన టికెట్స్ కొనిచ్చి తెలంగాణాకి తెప్పిస్తున్నామని తెలిపి ఇంకా చాల మంది అక్కడ ఉన్నారని కేటీర్ గారిని సహాయం చెవాల్సిందిగా కోరారు.
కేటీర్ గారు వెంటనే స్పందించి త్వరలో బృందాన్ని యూఏఈ పంపి బాధితులను తెప్పిస్తామన్నారు.













