“అమెరికా-మహానాడు” కు డల్లాస్ చేరుకొంటున్న ప్రముఖులు
అమెరికాలో మొదటిసారిగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో గల మార్తోమా చర్చిలో మే 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్న “అమెరికా-మహానాడు” కు రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులు, మంత్రులు హాజరవుతున్నారు.
ఇప్పటికే రాజ్యసభ ఎంపీ సీ.ఎం.రమేష్ డల్లాస్ చేరుకున్నారు. తెలుగు తమ్ముళ్ళ కూడా వుత్సాహంగా అమెరికాలోని అన్ని నగరాలనుంచి డల్లాస్ కు చేరుకొంటూన్నారు.
సభా ప్రాంగణాన్ని ఎన్టీఆర్, చంద్రబాబు పార్టీ నాయకులూ మరియు పరమపదించిన నాయకుల చిత్రపటాలతో అలంకరించారు. ఈరోజు మంత్రి గంటా, శాసనసభ్యులు కదిరి బాబూరావు, అనగారి సత్యప్రసాద్, తెతెదేపా కార్యదర్శి పెద్దిరెడ్డి, గాయకులు కౌసల్య, సింహా, శ్రీలక్ష్మీ, సందీప్ తదితరులు వేడుకలో పాల్గొవడానికి వస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఈ వేడుకల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేసారు.













