డల్లాస్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు!

తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం (T.A.T.A) డల్లాస్ లో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించింది. ఇర్వింగ్ లో ఉన్న కూచిపూడి ఇండియన్ కిచెన్ లో ఈ వేడుకులకు 200 పైగా మహిళలు హాజరైయ్యారు. మహిళలు ఇంటా, బైటా చేస్తున్న కృషి, మహిళా సాధికారత మరియు మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక సోదరిగా మరియు ఉద్యోగ రంగంలో తన కంటూ ఓక ప్రత్యెక స్థానాన్ని పొందింది అని పలువురు కొనియాడారు.
డల్లాస్ శాఖ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సునీత త్రిపురం ఆద్వర్యం లో ఈ కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది. ఉమెన్స్ కమిటీ నేషనల్ కో-ఛైర్ రూప కన్నయ్యగారి, T.A.T.A సంయుక్త కార్యదర్శి నీలోహిత కొత్తా, కల్చరల్ కమిటీ నేషనల్ ఛైర్ సమీరా ఇల్లెందుల, డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్లు శాంతి నూతి, దీప్తి సూర్యదేవార మరియు ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సౌత్ లేక్ మేయర్ లారా హిల్ పాల్గొన్నారు. సభని ఉద్యేశించి మాట్లాడుతూ భారతీయ స్త్రీ అంటే ఆమెకి ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో వీణా యలమంచిలి తన గాత్రంతో సభాసదులను అలరించారు.
T.A.T.A ప్రెసిడెంట్ విక్రం జంగం మాట్లాడుతూ మహిళలు అంటే తనకు ఎంతో గౌరవం అని పూర్తి కుటుంబాన్ని తన భుజాల పై మోస్తున్న స్త్రీ మూర్తి కి ఎల్లవేళలా అందరు కృతజ్ఞత తెలపాలని కోరారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. సెల్ఫీ కాంటెస్ట్, ఫాషన్ షో అని వినూత్నమైన కార్యక్రమాలతో నిర్వాహుకులు అందరిని ఆకట్టుకున్నారు.
T.A.T.A బోర్డు సభ్యులు మహేష్ ఆదిభట్ల, చంద్ర రెడ్డి పోలీస్ ల తో పాటు పవన్ గంగాధరా, శ్రీధర్ కుంభాల, శ్రీనివాస్ తుల, నిరంజన్ బూడిద, శ్రీకాంత్ రౌతు, సురేష్ పతనేని, రత్న ఉప్పాల, భవాని జొన్నలగడ్డ పాల్గొని తన సహాయసహకారాలు అందించారు.











































































