టాటా ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాడేస్‌లో భాగంగా డల్లాస్‌లో టాటా నాయకులు ఫుడ్ పంపిణీ కార్యక్రమం?నిర్వహించారు. దాదాపు 10,000 మందికి సరిపోయే ఫుడ్స్‌ను వారు నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ?కార్యక్రమంలో టాటా నాయకులు మనోహర్, పవన్ గంగాధర, సాయి అభిషేక్, నిరంజన్ రెడ్డి, గంగా దేవర, శ్రీనివాస్ తుల తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ బ్యాంక్‌కు విరాళమిచ్చిన డల్లాస్ టాటా టీమ్‌ను టాటా అధ్యక్షుడు భరత్ మాదాడి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ గనగోని, సురేష్, శ్రీనివాస్ మానాప్రగడ తదితరులు అభినందించారు.











































































