తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మ్యూజిక్ అండ్ మిమిక్రీ షో
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన మ్యూజిక్ అండ్ మిమిక్రీ షో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నేపథ్యగాయని కౌసల్య, మిమిక్రీ కళాకారుడు రమేష్, నటి సత్యకృష్ణన్లతో ఈ షో నిర్వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ కులకర్ణి దీనికి యాంకరింగ్ చేస్తున్నారు. కోవిడ్ 19 సంక్షోభ వేళలో కొంచెం మనస్సుకు ఉల్లాసమిచ్చేలా తానా ఇలాంటి లైవ్ షోలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఈ షోను ఏర్పాటు చేసింది. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, కార్యదర్శి రవి పొట్లూరి, ఫౌండేషన్ సెక్రటరీ రవి మందలపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం తానా మిడ్ అట్లాంటిక్ విభాగం రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రును 717 418 8324లో సంప్రదించవచ్చు.













