TANA: తానా ఎన్నికల ప్రకటన వచ్చింది…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ డైరెక్టర్ పదవులకు, ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ ను తానా బోర్డ్ (TANA Board) విడుదల చేసింది. 2025-27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు 2025-2029 సంవత్సరానికి బోర్డ్ డైరెక్టర్ (డోనర్-నాన్ డోనర్) పదవులకు, ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల కమిటీని కూడా తానా బోర్డ్ నియమించింది. ఎన్నికల కమిటీకి చైర్మన్ గా కనకంబాబు ఐనంపూడి వ్యవహరిస్తారు. సభ్యులుగా రాజేష్ జంపాల, విజయ్ గుడిసేవ ఉంటారు.
ఎన్నికల ప్రక్రియ ఈ విధంగా ఉంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రచురణ: మే 30, 2025 శుక్రవారం
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: బుధవారం జూన్ 11, 2025
నామినేషన్లు/నోటిఫికేషన్ ఆమోదం: శనివారం, జూన్ 14, 2025
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: శుక్రవారం, జూన్ 20, 2025
నామినేషన్ల తుది జాబితా ప్రచురణ/నోటిఫికేషన్: సోమవారం, జూన్ 23, 2025
బోర్డుకు తుది జాబితా ప్రదర్శన: శుక్రవారం జూన్ 27, 2025
ఎన్నికల ఫలితాల ధృవీకరణ/ప్రచురణ: శనివారం జూన్ 28, 2025
తానా ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తానా బోర్డ్ ఓ ప్రకటనలో కోరింది.







