వాషింగ్టన్ డీసీలో తానా సమావేశం నవంబర్ 3న
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలు వచ్చే జులై నెలలో వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభలకు కావాల్సిన ఏర్పాట్లను సమీక్షిచడం కోసం నవంబరు 3వ తేదీన డీసీలో తానా పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తానా నాయకులు తెలిపారు. ఇప్పటికే మహాసభల కోసం కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ మహాసభలకు కన్వీనర్ ను నియమించడంతో పాటు వివిధ కమిటీల నియామకాన్ని ఈ సమావేశంలో చేపట్టనున్నారు. తానా పాలకవర్గంతో పాటు మిగిలిన అన్ని విభాగాల సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. తానా అద్యక్షుడు వేమన సతీష్ అద్యక్షతన సమావేశం జరుగుతుంది. డిసెంబరులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని కూడా ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నారు.













